స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
జనగామ రూరల్: స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అధికా రులను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయ తీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్, కౌంటింగ్ విధులపై నోడల్ అధికారులు, స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులకు శుక్రవారం కలెక్టరేట్‌లో జెడ్పీ, జీపీ విభాగాల ఆధ్వర్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించే ఈ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం ద్వారా అందించిన కరదీపికను చదువుకొని సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని ఆదేశించా రు. సందేహాలు ఉంటే మండలాల వారీగా నియమించిన మాస్టర్ ట్రైనర్‌లను అడిగి నివృత్తి చేసుకో వాలని చెప్పారు. జిల్లాలో మొత్తం 2,543 పోలింగ్ కేంద్రాలకు గాను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 783 ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్టేజ్–1, 2కు సంబంధించి ఆర్‌ఓలు 75, ఏఆర్‌ఓలు 150 మంది చొప్పున, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆర్‌ఓలు 13 మంది, ఎంపీటీసీ ఎన్నికల కు సంబంధించి ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు 55 మంది చొప్పున, ఎంపీడీఓలు, ఎంపీఓలు హాజరయ్యారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విధుల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జెడ్పీ సీఈఓ మాధురీ షా, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీపీఓ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment