ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
జనగామ: జిల్లా కేంద్రంలోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్, పోలీసు అధికారులు శుక్రవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిర్వహణ అధ్వానంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాజీ బార్ యజమానికి రూ.10వేలు, అమృతబార్‌కు రూ.5వేలు, భువన బార్‌కు రూ.5వేలు జరిమా నా విధించి హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశం మేరకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణమూర్తి, నిఖిల్, ఎస్సై రాజన్‌బాబు, పురపాలిక స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ తనిఖీలు చేపట్టారు.
ఓవర్‌లోడ్‌తో
ప్రయాణిస్తే చర్యలు
జనగామ రూరల్: ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తే చర్యలు తప్పవని జిల్లా రవాణా అధికారి జీవీ.శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రం చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరి పొట్టు ఓవర్ లోడుతో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాలతోపాటు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడతారని, నింబధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎకో ఫ్రెండ్లీ
పర్యావరణం లక్ష్యం..
జనగామ: ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు కష్టపడి చదువుకుంటూనే.. ఎకో ఫ్రెండ్లీ పర్యావరణం లక్ష్యంగా నేటి యువత పనిచేయాలని రిడీమ్ ఇండస్ట్రీస్, ఫౌండర్, సీఈఓ అరుణ్‌కుమార్ అన్నారు. జనగామ మండలం యశ్వంతా పూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీసీ సెల్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన ‘ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ రెడీనెస్ లెవల్, కమర్షియలైజేషన్ ఆఫ్ ల్యాబ్ టెక్నాలజీ, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్’ అనే ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ద్వారా విద్యార్థులు సమాజానికి హాని కలిగించని విధంగా బయోడీగ్రేడబుల్ బ్యాగులు తయారు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం ఎకో ఫ్రెండ్లీ పర్యావరణానికి దోహదం చేస్తుందన్నారు. సీజేఐటీలో విద్యను అభ్యసించి, ఓ కంపెనీకి సీఈఓ గా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కోవాలని సూచించారు. హైదరాబాద్ సందెల ఇంజనీరింగ్ కళాశాల ఎండీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ సౌర, వాయు, జలశక్తి లాంటి ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులు ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీజేఐటీ కళాశాల డైరెక్టర్ డి.విజయపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఐటీసీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.యాకూబ్, అధ్యాపకులు డాక్డర్ బి.వీరు, రఘుపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
నాటికల పోటీలు
నయీంనగర్: హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో ఈనెల 23 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు గన్నమరాజు గిరిజామనోహరబాబు, వనం లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక నాటక రంగ సంస్థల ను ఆహ్వానించినట్లు తెలిపారు. పోటీలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తున్నాయ ని పేర్కొన్నారు. వరంగల్ సహృదయులంతా కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏవీ.నరసింహారావు, టి.లక్ష్మణరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment