బంజారాల అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: ప్రతి తండాలో తాగునీటి వసతి కల్పించడంతోపాటు బంజారాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎంఆర్ గార్డెన్‌లో డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయ న మాట్లాడారు. తన వంతు సహకారంగా బంజా రా భవనానికి భూమి, అలాగే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి సేవాలాల్ మహరాజ్ విగ్రహం ఇప్పిస్తానని చెప్పా రు. డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మా ట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బంజారా భవనం నిర్మాణానికి సహకరించటం లేదని, బంజారాల ఓట్లతో గెలిచిన నాయకులు గిరి జనుల సమస్యలు పట్టించుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు చౌరస్తా నుంచి లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజ్మీరా స్వామినాయక్, సేవాలాల్ జయంతి స్పెషల్ ఆఫీసర్ రూపరాణి, మాజీ కౌన్సిలర్ అనిత, జిల్లా వైద్యులు బాలాజీనాయక్, శంకర్‌నాయక్, కొర్ర కాలురామ్‌నాయక్, ధర్మ భిక్షం, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంకోటి, బానోతు రవి, గోవర్ధన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతి వేడుకల్లో
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment