విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా చర్యలు
జనగామ: వినియోగదారుల డిమాండ్ కు తగ్గట్టుగా మరింత నాన్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ టి.వేణుమాధవ్ అన్నా రు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జనగా మ సర్కిల్ పరిధిలో ప్రస్తుత నెల 12వ తేదీ రోజున గరిష్ట విద్యుత్ డిమాండ్ 5.75 మిలియన్ యూని ట్లు నమోదు కాగా.. రాబోయే మూడు నెలల్లోనూ గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. గత మూడు నెలల నుంచే వేసవి కాలం ముందస్తు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని, ఆ మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. ముందు ఎక్కడెక్కడ అదనపు లోడ్ పెరుగుతుందో నిర్ధారించుకుని కొత్తగా 32 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామని, అలాగే 45 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచి, 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో నూతనంగా 5 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను బిగించినట్లు వివరించారు. అత్యవసర సమయంలో ప్రత్యామ్నాయ లైన్(ఇంటర్ లింకు) ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి కొత్తగా రెండు ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పా టు చేశామని తెలిపారు. మెరుగైన, కోతలు లేని విద్యుత్ సరఫరా కోసం కొత్త ఫీడర్లను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్
సమస్యల పరిష్కారానికి
టోల్‌ఫ్రీ నంబర్ 1912
విద్యుత్ వినియోగదారులకు 24 గంటల పాటు సేవలందిస్తున్నామని, సమస్యలు ఉత్పన్నమైతే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు పోన్ చేయాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు పెయిల్యూర్, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లోవోల్టేజీ, బ్రేక్ డౌన్స్, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, తీగలు, విద్యుత్ బిల్లుల్లో తేడాలు, పేరు మార్పు, మీటర్లలో సాంకేతిక సమస్య, సర్వీసు రద్దు తదితరాలకు టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా చర్యలు
Comments
Please login to add a commentAdd a comment