బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
బచ్చన్నపేట : కొడవటూర్‌లోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ నల్లొగొండ సహాయ కమిషనర్ భాస్కర్‌రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం ఉంటుందని చెప్పారు. కల్యాణానికి వచ్చే వేలాది మంది భక్తుల కు వసతుల కల్పనలో లోటు లేకుండా చూడాలన్నా రు. కట్టుదిట్టమైన భద్రత, వైద్య సేవలు అందుబా టులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కార్యనిర్వహణాధికారి చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమఃశివాయ, డైరెక్టర్ నిమ్మ కర్ణాకర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
పాలకుర్తిలో ఏర్పాట్ల పరిశీలన
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం దేవాలయ ధర్మాదాయ శాఖ నల్లొగొండ సహాయ కమిషన్ కె.భాస్కర్ పరిశీలించారు. ఆలయంలో భక్తుల కోసం క్యూలైన్, చలువ పందిళ్లు ఏర్పాటు చేయగా.. సందర్శించారు. లడ్డూ తయారీని పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెట్ కొత్తపల్లి వెంటకయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
భాస్కర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment