జనగామ రూరల్ : రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ పి.శ్రీనివా సరావు ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి మొత్తం 1,851 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఈనెల 23న ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు జిల్లా పరిధిలో తొమ్మిది సెంటర్లు కేటాయించామని తెలిపారు. నిర్దేశిత సమయానికి గంట ముందే సెంటర్‌లోకి అనుమతిస్తారని, ప్రతీ విద్యార్థి హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్ తప్పనిసరి వెంట తెచ్చుకోవాలని సూచించారు.
జిల్లా కోఆర్డినేటర్ పి.శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment