నీటి కొరత రాకుండా చూడాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
● వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు..
జనగామ రూరల్: వచ్చే నెల నిర్వహించే ఇంట ర్మీడియట్ వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమన్వ య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 8,945 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనుండగా, అందులో ఫస్టియర్ 4,251, సెకండియర్ 4,694 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 17 సెంటర్లు కేటాయించామని, వీటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, సంబంధిత అధికారులు కేటాయించిన విధుల ను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు సమయానుకూలంగా పరీక్ష కేంద్రాలకు చేరేలా ఆర్టీసీ బస్సులు నడపాలని, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని అన్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో తాగునీరు, శానిటేషన్, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులుంటే టెలిమానస్‌లో సంప్రదించాలన్నారు. 14416 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ఏసీపీ పండారి నితిన్‌చేతన్, పరీక్షల నోడల్ అధికారి పింకేష్‌కుమార్, ఇంటర్మీ డియట్ జిల్లా అధికారి దినేష్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, డీఈఓ రమేష్ పాల్గొన్నారు.
జనగామ రూరల్: వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని నీటి కొరత రాకుండా చూడాల ని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. తాగునీరు, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పన్ను వసూళ్లపై గురువారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఈఈలు, ఏఈలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులతో జూమ్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎల్1, ఎల్2, ఎల్3 జాబితా లో ని కుటుంబాల వివరాలను మరోసారి పరిశీలించి తుది జాబితా ఈనెల 28వ తేదీలోగా ఇవ్వాలన్నా రు. వేసవిలో సాగు, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఇందుకు గ్రామాల వారీగా కార్యాచరణను సిద్ధం చేయాలని చెప్పారు. మున్సిపల్ వార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పన్ను వసూళ్లు వందశాతం చేపట్టాలని, ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచడంతో పాటు వారికి వందరోజుల పని కల్పించాల ని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. గ్రామ నర్సరీల్లో మొక్కల పెంపకానికి విత్తనాలు వేయాలని సూచించారు. ప్రతి బుధవా రం అంగన్వాడీ కేంద్రాలను, శుక్రవారం రెసిడెన్షి యల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ మాధురీ షా, జనగామ, ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, డీపీఓ స్వరూప, ఈఈ హౌసింగ్ మాత్రునాయక్, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, ఈఈ మిషన్ భగీరథ శ్రీకాంత్, అడిషనల్ డీఆర్డీఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రుణాల రికవరీ వేగవంతం చేయాలి
రుణాల రికవరీ వేగవంతం చేసి లక్ష్యాలు నెరవేర్చా లి కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా గ్రామీణా భివృద్ధి శాఖ ఆధ్వర్యాన సీ్త్రనిధి, మహిళా శక్తి, ఇంది రమ్మ క్యాంటీన్, బ్యాంక్ లింకేజీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment