మార్కెట్లో మాయ! | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లో మాయ!

Mar 15 2025 1:46 AM | Updated on Mar 15 2025 1:44 AM

రంగుల కేళీ
కొలతలు, తూకాల్లో మోసం
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఉండాలి

జిల్లాలో అంబరాన్నంటిన సంబురాలు

సహజసిద్ధమైన రంగులతో హోలీ వేడుకలు

ప్రజల జీవితాల్లో రంగుల వెలుగులు నింపాలి

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

ఏ ఫిర్యాదు ఎక్కడ..

ఎంత నగదు?

జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కన్జూమర్‌ డిస్ప్యూట్స్‌ రిడ్రెసల్‌ కమిషన్‌ (వినియోగదారుల కమిషన్‌) పని చేస్తుంది. జిల్లా స్థాయి ఫోరం వస్తువులు/సేవల విలువ రూ.50 లక్షల్లోపు ఫిర్యాదులు పరిష్కరిస్తుంది. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య రాష్ట్ర స్థాయి, రూ.2 కోట్లకు మించిన విలువైన ఫిర్యాదులను జాతీయ స్థాయి ఫోరం పరిష్కరిస్తుంది. వస్తు సేవల్లో నష్టపోయి పరిహారం కోరాలనుకుంటే.. వివరాలను నాలుగు ప్రతులతో దరఖాస్తు చేయాలి. వస్తువుసేవల కొనుగోలు రుజువులు జతపర్చాలి. ఫోరం ఫీజు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రూ.200, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షలు ఆపైన పరిహారం కోసం రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఫోరం స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. వివిధ కారణాలతో తిరస్కరిస్తే ఫిర్యాదుదారుడు తనవాదన వినిపించవచ్చు. ఫోరంలో వినియోగదారుడే తన కేసును వాదించుకోవచ్చు. లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.

సాక్షి, వరంగల్‌: మార్కెట్లో కొందరు వ్యాపారులు తూకాలు, కొలతల్లో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసారాలతోపాటు అన్నింటిలోనూ చేతివా టం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతలు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం.. వినియోగదారుల హక్కులపై ప్రచారం చేయడంలోనూ విఫలమవడం ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

మోసం.. కల్తీ ఇలా..

● నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థాలు, పండ్ల తూకాల్లో మోసాల సంగతి చెప్పనక్కర్లేదు. కిలోకు 200 గ్రాముల వరకూ కోతపెట్టి అమ్ముతున్నారు. కొన్ని వస్తువులను ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వార సంతలు, మార్కెట్లు, రైతు బజార్లలో సైతం రాళ్లనే తూనికలకు వినియోగిస్తున్నారు. పాలు, వంట నూనెలు, ఉప్పు, మిరప పొడి, ఐస్‌ క్రీం, బేకరీ ఫుడ్స్‌, ఫ్రైడ్‌ చికెన్‌, మసాలా దినుసులు, అన్ని రకాల స్వీట్లలో కల్తీ జరుగుతోంది.

● జనరిక్‌ మందుల పేరిట అధిక ధరలకు అమ్ముతున్నారు. డాక్టర్‌ అటాచ్డ్‌ కౌంటర్లలో చెప్పనక్కరలేదు. ప్లాస్టిక్‌ బాటిళ్లలో దగ్గు మందులు విక్రయించొద్దు. కాలపరిమితి ముగిసిన మందులు సైతం విక్రయిస్తున్న మెడికల్‌ దుకాణాలు ఉండడం గమనార్హం.

● కొన్ని పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రికల్‌ రీడింగ్‌ మిషన్లను ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. లీటరు పెట్రోల్‌కు 100 నుంచి 200 మిల్లీలీటర్ల వరకూ తక్కువగా వస్తోంది. ఏరోజుకారోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రదర్శించాల్సి ఉన్నా.. ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు.

● గృహ నిర్మాణ సామగ్రి అమ్మకాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. 25 కేజీల సిమెంట్‌ బస్తాకు కే జీ, కేజీన్నర తరుగు వస్తోంది. కొంతమంది దళారులు బస్తాల్లోని సిమెంట్‌ తీసి రీ ప్యాక్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇనుము కేజీల లెక్కన విక్రయించాల్సి ఉన్నా.. చాలామంది విడి పరికరాల కింద అమ్ముతూ కొలతల్లో మోసం చేస్తున్నారు.

●బంగారు ఆభరణాలు విక్రయించే కొన్ని షాపుల్లో తూకాల్లో తేడా ఉంటోంది. పండుగల రాయితీలు.. గ్రాము రూ.200 తక్కువ అంటూ ప్రకటనలతో ఆకర్షిస్తూ మోసం చేస్తున్నారు. ఈవిషయమై తూనికలు.. కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో డిజిటల్‌ త్రాసుల్లో లోపాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. బంగారం, వెండి అమ్మకాల్లో రశీదుపై నాణ్యతా ప్రమాణాలు, హెచ్‌యూఐడీ నంబర్‌ తప్పనిసరిగా రాయాలి. చాలా వరకు ఇవి పాటించడం లేదనే ఫిర్యాదులున్నాయి.

కమిషన్‌ను ఎప్పుడు ఆశ్రయించాలంటే..

ఆన్‌లైన్‌ సేవలు విస్తృతం కావడంతో ఇంటి నుంచి వివిధ వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీలను కూడా వినియోగదారుల రక్షణ చట్టం–2019 పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా.. వాటి వల్ల నష్టం జరిగినా.. తూకాల్లో మోసాలకు పాల్పడినా పరిహారం కోరే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. నాణ్యతలేని, కల్తీ సరుకులు విక్రయించినప్పుడు.. కాలం చెల్లిన ఔషధాలు అమ్మినా.. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు విక్రయించినా.. ప్రైవేట్‌ వైద్యుల నిర్లక్ష్యం, సేవల్లో లోపం కారణంగా నష్టం వాటిల్లినా.. ఎలక్టాన్రిక్‌ పరికరాలు సక్రమంగా పని చేయకపోయినా.. విత్తనాలు, ఎరువులు, పురుగు ముందులు కల్తీ జరిగినా.. బ్యాంకులు, విద్యుత్‌ సంస్థలు, విమానయాన సంస్థలు, బీమా సంస్థలు అందించే సేవల్లో లోపాలు ఉంటే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు.

సాక్షి ఇంటర్వ్యూలో వినియోగదారుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్‌ సాధిక్‌ అలీ

జనగామ: వినియోగదారుల పరిరక్షణకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 23 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని వినియోగదారుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్‌ ఎండీ సాధిక్‌ అలీ అన్నారు. నేడు (శనివారం) ప్రపంచ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో సాధిక్‌ అలీ మాట్లాడారు.

ప్రశ్న: ముప్పై ఏళ్లుగా వినియోగదారుల కోసం చేసిన అనుభవాలు ఏంటి!

జవాబు: పట్టణం నుంచి మారుమూల పల్లె వరకు ప్రతీ వ్యక్తిని కలిసి వినియోగదారుల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం.

ప్రశ్న: వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?

జవాబు: ప్రతీ దుకాణంలో తూకం విషయంలో మోసం జరుగుతోంది. డిజిటల్‌ తూకం విషయానికి వస్తే, ఇందులో కూడా అనేక అమరికలు చేస్తూ మోసం చేస్తున్నారు. టీ పొడిలో కల్తీ, మిర్చి పౌడర్‌లో రంపపు పొడి, పప్పు దాన్యాల్లో కూడా నాసిరకం వస్తుంది. ప్రజలు మేల్కొంటేనే కల్లీని అరికట్టవచ్చు,

ప్రశ్న: వినియోగదారులు వారి సమస్యలను ఫిర్యాదు చేయకపోవడానికి కారణం ఏమిటి?

జవాబు: చట్టాల్లో లొసుగులతో తప్పించుకోవడం, చట్టాలను అమలు చేసేందుకు సరైన యంత్రాంగం లేకపోవడం ప్రధాన కారణం. ఫిర్యాదు చేసినా.. ఒరిగింది ఏమీ లేదని భావిస్తున్నారు.

ప్రశ్న: సాధారణ ప్రజలు వినియోగదారుల హక్కులను ఏ విధంగా ఉంపయోగించుకోచ్చు?

జవాబు: కల్తీని ప్రశ్నించాలి. చట్టాలను తెలుసుకోవాలి. నలుగురితో షేర్‌ చేసుకోవాలి. కూరగాయల మార్కెట్‌లో తక్కువ తూకాన్ని నిలదీయాలి. ప్రతీఒక్కరిలో నిలదీసేతత్వం కలగాలి. పాలలో కల్తీని ఎండగట్టినప్పుడే ఇలాంటి మోసాలను అరికట్టగలుగుతాము. కలెక్టరేట్‌ ప్రాంగణం సెల్లార్‌లో వినియోగుదారుల సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, సేవలు అందిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.

వినియోగదారులకు అండగా..

వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ‘ఈట్‌ రైట్‌ ఫుడ్‌’ అనే అంశంపై వినియోగదారుల్లో చైతన్యం కల్పిస్తూ అండగా నిలుస్తున్నాం. కల్తీ పాల అమ్మకందారులపై నాలుగు ప్రైవేట్‌ డెయిరీలపై ఫిర్యాదు చేశాం. దగ్గు మందుల్లో హానికారకాలు, బాటిళ్లపై సమాచారం లేకపోవడం, ప్లాస్టిక్‌ బాటిళ్లలో విక్రయంపై జాతీయ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాం. అమ్మాయిలను ఆకర్షించి మోసగిస్తున్న స్లిమ్మింగ్‌ సెంటర్లపై కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీలో ఫిర్యాదు చేశాం.

– సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల

మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి

సంబంధిత అధికారుల్లో నిర్లిప్తత

నష్టపోతున్న వినియోగదారులు

ప్రశ్నించి పోరాడితేనే దగాకు చెక్‌

మార్కెట్లో మాయ!
1
1/2

మార్కెట్లో మాయ!

మార్కెట్లో మాయ!
2
2/2

మార్కెట్లో మాయ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement