దేవరుప్పుల: ఆధ్యాత్మిక చింతనతోనే సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షించబడుతాయని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కడవెండి శివారులో గుట్టపై ఉన్న లక్ష్మీనర్సింహ్మస్వామి కల్యాణం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలంబ్రాలను వారు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన మగ్గంపై నూతన వస్త్రాల తయారీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మూలవిరాట్ కల్యాణానికి తలంబ్రాలు, వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాది నాటికి జాతర అభివృద్ధి పెండింగ్ పనులు పూర్తి చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణనాయక్, కొడకండ్ల మార్కెట్ చైర్‌పర్సన్ నల్ల అండాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, ఉత్సవ కమిటీ చైర్మన్ పెద్ది రమేష్, ఆలయ పూజారులు బీట్కూరి సంపత్‌కుమారచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పెద్ది కృష్ణమూర్తి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయానికి ముందుగానే చేరుకున్నారు. ఎమ్మెల్యే తలంబ్రాలు తీసుకెళ్తున్న క్రమంలో ఉత్సవ ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తున్న కృష్ణమూర్తిని పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేసే యత్నం చేశారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
గోవిందా నామస్మరణతో
మూలవిరాట్‌కు తలంబ్రాలు
ఉత్సవాల్లో వెలుగు చూసిన
కాంగ్రెస్ విభేదాలు


