తగ్గిన ధాన్యం దిగుబడి | - | Sakshi
Sakshi News home page

తగ్గిన ధాన్యం దిగుబడి

Mar 18 2025 8:44 AM | Updated on Mar 18 2025 8:42 AM

కరువు కాటేసింది.. పంట తగ్గింది

వానాకాలంలో

55 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట

లక్ష్యం 20 లక్షల క్వింటాళ్లు..

సేకరణ 9.10 లక్షలే..

బోనస్‌ కోసం అన్నదాతల

ఎదురుచూపులు

యాసంగి సీజన్‌కు

యాక్షన్‌ ప్లాన్‌కు సన్నద్ధం

జనగామ: వానాకాలం సీజన్‌లో ప్రకృతి వైపరీత్యాలతో ధాన్యం దిగుబడి తగ్గింది. సాగునీటి కొరత రైతులను వెంటాడింది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించింది. 25 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పొట్టదశలో చీడపీడలు, కోత దశలో వడగళ్లు, అకాల వర్షాలు 40 శాతం పంటను నాశనం చేసింది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేయగా, 55 వేల పైచిలుకు ఎకరాల పరిధిలో పంట దెబ్బతింది. అకాల వర్షాల భయంతో చాలా మంది రైతులు పచ్చి మీదనే కోతలు మొదలు పెట్టి, 30, 40 శాతానికి పైగా తేమతో ధాన్యం గింజలను మార్కెట్‌కు తరలించారు. ప్రభుత్వం అప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో క్వింటాకు మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకున్నారు. కోతలు మొదలైన 20 రోజుల తర్వాత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో తీసుకురాగా, అప్పటికే ప్రైవేట్‌లో 6 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.

25 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా..

జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఽ20 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రకృతి వైపరీత్యాలతో 55 వేల ఎకరాలకు పైగా పంటపై తీవ్ర ప్రభావం చూపించింది. మొత్తంగా 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, సుమారు 5 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గగా, ప్రైవేట్‌తో పాటు ఎక్స్‌పోర్టులో 8 లక్షల వరకు కొనుగోళ్లు జరిగాయి. దిగుబడి అంచనా మేరకు 20 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ లక్ష్యంగా రంగంలోకి దిగారు. సుమారు నెల రోజులకు పైగా కొనుగోళ్లు జరిగాయి. జిల్లాలో 17,391 మంది రైతుల వద్ద దొడ్డు, సన్న రకానికి చెందిన ధాన్యం 9.10లక్షల (9,10,043 మెట్రిక్‌ టన్నులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డురకం 6,22,061 క్వింటాళ్లు, సన్నరకం 2,87,082 క్వింటాళ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ మొత్తానికి రూ.211.21 కోట్లకు గాను వందశాతం చెల్లింపులు పూర్తయ్యాయి. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ చొప్పున రూ.14.39 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీంట్లో ఇప్పటి వరకు రూ.14.18 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.21.21 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రైతులకు బోనస్‌ డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం రైస్‌మిల్లులకు తరలించారు.

తగ్గిన ధాన్యం దిగుబడి 1
1/1

తగ్గిన ధాన్యం దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement