నెల రోజుల్లో సేవలు ప్రారంభం
జిల్లా ఆస్పత్రికి చేరిన యంత్రం
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(డీహెచ్)కి బుధవారం సీటీ స్కాన్ యంత్రం చేరుకుంది. సీటీ స్కాన్ సేవలు లేక పేద ప్రజలు వైద్య పరంగా ఇబ్బందులు పడుతున్న తీరుపై ‘పేరుకే పెద్దాస్పత్రి–ఎనిమిదేళ్లుగా మూలన పడిన సేవలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్య, వైద్య, కుటుంబ సక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంతో.. సీటీ స్కాన్ కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) డాక్టర్ వాణి గత ఏడాది జూన్‌లోనే ప్రాసెస్ ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీఎంఈ.. సదరు కంపెనీకి ముందస్తు డబ్బులు చెల్లించా రు. ఈ విషయమై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావుకు సమాచారం ఇవ్వగా స్కానింగ్ యంత్రం ఏర్పాటు, విద్యుత్ సరఫరా సామర్థ్యం పెంపు తదితర ఏర్పాట్లు చేశారు.
నెలరోజుల్లో సేవలు ప్రారంభం..
సీటీ స్కాన్ సేవలు నెలరోజుల వ్యవధిలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మూలన పడిన యంత్రాన్ని రూం నుంచి తొలగించిన తర్వాత నూతన యంత్రాన్ని బిగించనున్నారు. అనంతరం టెక్నీషియన్లు ఇన్‌స్టాలేషన్ చేస్తారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కానింగ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘సాక్షి’ కథనాలను అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు మంతెన మణి, వంగభీమ్‌రాజ్, జేఏసీ, ఇతర పార్టీల నాయకులు సీఎంఓ, మంత్రులకు ఎప్పటికప్పడు ట్విట్టర్ వేదికగా పోస్టు చేస్తూ తమవంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా ప్రజలు ‘సాక్షి’ చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సీటీ స్కాన్ వచ్చేసింది
సీటీ స్కాన్ వచ్చేసింది
సీటీ స్కాన్ వచ్చేసింది


