కాజీపేట అర్బన్: నిట్ అలుమ్ని ఆధ్వర్యంలో గురువారం మెటలార్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థిని హర్షిత ఆర్.సజ్జన్‌కు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. నిట్ వరంగల్ మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం దివంగత ప్రొఫెసర్ ఏవీ.రమణారావు స్మారక గోల్డ్ మెడళ్లను అలుమ్ని ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ నూతన ఒరవడికి నాంది పలికిన పూర్వ విద్యార్థులకు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆన్‌లైన్‌లో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏవీ.శేషగిరిరావు, రాజు దట్ల, శుక్లా మండోల్ తదితరులు పాల్గొన్నారు.


