కాళేశ్వరంలో సీసీ కెమెరాలు
కాళేశ్వరం: ‘వరుస చోరీలతో జనం బెంబేలు, పనిచేయని సీసీ కెమెరాలు’ అని సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. శనివారం ప్రధాన రహదారితో పాటు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలకు మరమ్మతులు చేశారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్సై తమాషారెడ్డి తెలిపారు.
‘నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలి’
భూపాలపల్లి అర్బన్: బీఎంఎస్ నాయకులపై ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని బీఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మండా రమాకాంత్ హెచ్చరించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపీఎఫ్ నిధుల కుంభకోణంపై సీబీఐ విచారణతో దోషులను గుట్టురట్టు చేస్తామన్నారు. సీబీఐకి నోటీసులు పంపించడంలో బీఎంఎస్ కీలక భూమిక పొషించిందన్నారు. అది కాకుండా జనక్‌ప్రసాద్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాయకులు బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్, నాయకులు సుజేందర్, నర్సింగరావు, మల్లేష్, మొగిలి, భాస్కర్, శ్రీనివాస్, సాగర్ పాల్గొన్నారు.
పర్యాటకుల సందడి
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్, రాజ్‌కుమార్ పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ విద్యార్థులకు వివరించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన విద్యార్థులు ఆలయంలో పలుచోట్ల గ్రూప్ ఫొటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. రష్యాకు చెందిన వాల్ రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
కాళేశ్వరంలో సీసీ కెమెరాలు
కాళేశ్వరంలో సీసీ కెమెరాలు
కాళేశ్వరంలో సీసీ కెమెరాలు
Comments
Please login to add a commentAdd a comment