పోడు రైతులపై దాడి సరికాదు
భూపాలపల్లి అర్బన్: ఆజాంనగర్‌లో పోడు రైతులపై అటవీశాఖ అధికారులు దాడి చేయడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆజాంనగర్ శివారులో ఏళ్ల తరబడి పొడు చేసుకుంటున్న వ్యవసాయ భూముల రైతులను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా చితకబాదడం సరైంది కాదన్నారు. ఆడ, మగ తేడా లేకుండా విచక్షణారహితంగా కొట్టి పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసులు నమోదు చేశారని చెప్పారు. పోడు రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొత్కు ప్రవీణ్‌కుమార్, రాంచందర్, జోసెఫ్, రవికాంత్, రాజేష్, చంద్రయ్య, తిరుపతి, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment