తాటి కల్లు దివ్యఔషధం
కాటారం: తాటి కల్లు దివ్య ఔషధం అని.. తాటి కల్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మహాముత్తారం మండలం సింగారానికి శనివారం పుట్ట మధు స్వయంగా తాటి కల్లు తాగడం కోసం వచ్చారు. గ్రామంలోని తాటి వనం వద్ద కూర్చొని తాటికల్లు తాగి గౌడన్నలతో ముచ్చటించారు. పుట్ట మధు వెంట బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్, మాజీ జెడ్పీటీసీ మందల రాజిరెడ్డి, నాయకులు జోడు శ్రీనివాస్, మార్క రాముగౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రావు, రాధారపు స్వామి, రామిళ్ల కిరణ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment