వదిలేస్తున్నారు..!
కాటారం:
ఓ వైపు సాగునీటి కొరత.. మరోవైపు ముదురుతున్న ఎండలు కూరగాయలు సాగుచేసే రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయాలుగా నిలిచిన జిల్లాలోని పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమవుతున్నాయి. గత వేసవి కంటే ప్రస్తుతం ఆరంభంలోనే ఎండల తీవ్రత ఉండటంతో పాటు సాగు నీటి వనరులు మెల్లి మెల్లిగా ఎత్తి పోతుండటంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. బోరుబావులపై ఆధారపడి కూరగాయల సాగు ప్రారంభించిన రైతులు ఎండ తీవ్రతతో బోర్ల నుంచి సాగు నీరు పూర్తి స్థాయిలో అందక మధ్యలోనే తమ పంటలను వదిలేస్తున్నారు.
కూరగాయలే జీవనోపాధిగా..
జిల్లాలో కూరగాయల సాగే జీవనోపాధిగా కొనసాగుతున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. కాటారం మండలకేంద్రంతో పాటు గంగారం, ఆదివారంపేట, బస్వాపూర్, మల్హర్ మండలం కుంభంపల్లి, కొండంపేట, వలెంకుంట, మహదేవపూర్ మండలకేంద్రంతో పాటు బొమ్మాపూర్, సూరారం, అంబట్‌పల్లి, కుదురుపల్లి గ్రామాల్లో కూరగాయల సాగు అధికంగా జరుగుతుంది. టేకుమట్ల, మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ గ్రామాల్లో కూరగాయల సాగు జరుగుతుంది. ఆయా గ్రామాల్లో టమాట, మిర్చి, కాకర, బీర, క్యాబేజ్, అలిచంత, సోరకాయ, క్యారెట్, ముల్లంగి, మునగ, బీట్‌రూట్, దొండ, బెండ, గోబిపువ్వుతో పాటు ఆకుకూరలు సాగు చేస్తున్నారు.
తగ్గిన కూరగాయల సాగు..
వేసవి కాలంలో సాగు నీరు అందక, ఎండల తీవ్రత కారణంగా గ్రామాల్లో కూరగాయల సాగు తగ్గిపోతూ వస్తుంది. విస్తారంగా కూరగాయల సాగు జరిగే కాటారం మండల కేంద్రంతో పాటు గంగారం, మల్హర్ మండలం కొండంపేట, కుంభంపల్లి, చిట్యాల, మహదేవపూర్ మండలాల్లో కూరగాయల సాగు అధికంగా తగ్గిపోయింది. ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం భూపాలపల్లి, గణపురం, మహాముత్తారం, పలిమెల మండలంలో ఈ ఏడాది కూరగాయల సాగే లేకుండా పోయింది.
సాగు మధ్యలోనే..
వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి సమస్య ఏర్పడుతుండటంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు. బోరుబావులను నమ్ముకొని సాగు చేసిన పంటలకు సరైన నీటి తడి అందక మధ్యలోనే పంటను వదిలేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీరు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నీరు అందకపోతే మొక్కలు వాడిపోయి అతితక్కువ సమయంలో చనిపోతాయి. బోరుబావులను నమ్ముకొని కూరగాయలు సాగు చేసిన రైతులు నీరు సరిగా అందక పంటలు కళ్లముందే ఎండిపోతుంటే ఆవేదన చెందుతున్నారు. సాగునీటికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో పంటలను అర్థాంతరంగా వదిలేస్తున్నారు. ఒకవేళ శ్రమంచి పంటలకు నీరు అందించినప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో
కూరగాయల సాగు వివరాలు..
పుచ్చకాయలు 120
ఎకరాలు
టమాట
140
ఎకరాలు
ఆకుకూరలు
10 ఎకరాలు
కూరగాయల పంటలపై ఎండ ప్రభావం
నీరు అందక ఎండిపోతున్న తోటలు
ఆశించిన స్థాయిలో రాని దిగుబడి
వదిలేస్తున్నారు..!
వదిలేస్తున్నారు..!
Comments
Please login to add a commentAdd a comment