భూపాలపల్లి రూరల్: జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించడం అభినందనీయమని భూపాలపల్లి సింగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ అంకితభావంతో సాధన చేస్తే సాధించలేనిది ఏదీలేదన్నారు. క్రీడలతో పాటు విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించాలని కోరారు. అలాగే విద్యార్థులకు స్విమ్మింగ్ నేర్పించిన కోచ్ పాక శ్రీని వాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీవైపీఎం క్రాంతి కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, కోచ్ రాజమౌలి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా సింగరేణి సంస్థ సీఎండీ బలరాం ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలపగా జీఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అధికారులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఎస్‌టూఓ జీఎం కవింద్ర, అధికారులు సురేఖ, శ్రావణ్ కుమార్, ఏరియా అధికార ప్రతినిధి కావూరి మారుతి తదితలరులు పాల్గొన్నారు.


