శనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025
9
వసంతాలకు అనాది. శుభాలకు పునాది. తెలుగు సంవత్సరాది.. ఉగాది. కోయిలమ్మ కమ్మని స్వరాల నడుమ, షడ్రుచుల మేళవింపులో కోటి ఆశలకు రెక్కలు తొడుగుతూ వచ్చే వేడుక ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంప్రదాయానికి జీవం పోసేలా సాగే పర్వదినమిది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ కవుల భావాలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తోంది. మరింకెందుకాలస్యం.. కలాలు కదిలించండి.. ఉగాదిపై కవితలు రాయండి.
చివరి తేదీ : 29–03–2025
ఇఫ్తార్ విందులో ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే సత్యనారాయణరావు, పోలీసు అధికారులు
భూపాలపల్లి రూరల్: సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణవుతో కలిసి పట్టణ ముస్లిం పెద్దలు, పోలీసు ముస్లిం ఉద్యోగులకు ఎస్పీ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం కలయికే రంజాన్ మాసం అన్నారు. రంజాన్ మాసం అందరిలో సోదరభావం పెంపొందిస్తుందన్నారు. ఈ మాసంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం అన్నారు. సర్వ మతాలసారం ఒకటేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, రామ్మోహన్‌రెడ్డి, డీటీఓ సంధాని, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
ఎస్పీ కిరణ్ ఖరే
జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి


