మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి, మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి ముద్దమల్ల రాజేందర్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముల్కలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, వారి అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆయన తో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్ ఉన్నారు.
ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు శుక్రవారం ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భౌతికశాస్త్ర పరీక్ష జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిందన్నారు. 3,449 మంది విద్యార్థులకు గాను 3,442 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.


