వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త
ప్రాథమిక చికిత్స
● వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి.
● ఫ్యాను గాలి లేదా చల్లని గాలి తగిలేలా ఉంచాలి.
● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబొండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్‌ఎస్) తాగించవచ్చు. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి.
చేయకూడని పనులు
● మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో బయట ఎక్కువగా తిరగొద్దు.
● రోడ్లపై విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగవద్దు.
● ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తినడం మంచిది.
● మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
● వేసవిలో ఆకలి తక్కువగానూ దాహం ఎక్కువగానూ ఉంటుంది. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.
అత్యధికంగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు
● సోమవారం 40 డిగ్రీలు..
● ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు
● ముందస్తు జాగ్రత్తలతో ఉపశమనం
వేసవికాలం అంటే ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటం సాధారణం. కానీ, ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెల్లవారడమే ఆలస్యం అన్నట్లుగా ఉదయం నుంచే సూర్య ప్రతాపం ప్రారంభం అవుతుండడంతో జనం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే ఈనెల చివరి వరకు, మేలో ఎండల ప్రభావం ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
– భూపాలపల్లి అర్బన్
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ తాకిన వారి కాళ్లు వాపులు వస్తాయి. కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తలతిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి సత్వర వైద్యం అందించాలి.
జిల్లాలో భానుడు భగ్గుమంటుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 9గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇప్పుడే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈనెల చివరి, మే మాసంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తేలికపాటి ఆహారం ఉత్తమం
నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, జంక్ ఫుడ్ వంటి వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం, తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బాగా చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉండాలి.
వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త
వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త
వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త


