7, 8 తేదీల్లో ఉచిత కంటి వైద్యశిబిరం
కాటారం: శ్రీపాద ట్రస్టు, పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. వైద్యులు, సిబ్బందితో గురువారం మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్‌లో డీఎంహెచ్‌ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిబిరంలో ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తారన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారు హైదరాబాద్‌లోని పుష్పగిరి ఆస్పత్రికి వెళ్లడానికి, తిరిగి రావడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్యాధికారిణి మౌనిక, వైద్యులు సందీప్, సుష్మిత, కల్యాణి, వినయ్, మహేంద్రనాధ్‌యాదవ్, ఆప్తమిక్ ఆఫీసర్స్ బూరుగు రవి, సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


