విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు
కాటారం: గ్రామాల్లో లోవోల్టేజ్ విద్యుత్ సమస్యను అధిగమించేందుకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ మల్చూర్ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో లో వోల్టేజ్ సమస్య నివారణలో భాగంగా నాలుగు చోట్ల నూతనంగా ఏర్పాటు చేసిన 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను గురువారం ఎస్‌ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ గారెపల్లిలోని అయ్యప్ప టెంపుల్ రోడ్, హనుమాన్‌నగర్, మాంటిస్సోరి స్కూల్ కాలనీ, హమాలీ వాడలో కొంత కాలంగా లో వోల్టేజ్ సమస్య ఉన్నట్లు వినియోగదారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో సుమారు రూ.16 లక్షల వ్యయంతో నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సిబ్బంది కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఇన్‌చార్జ్ ఏఈ ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈ మల్చూర్


