నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన
కాటారం: కాటారం మండలంలో నేడు(శుక్రవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటించనున్నారు. మండలకేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలకు సంబంధించి పంపిణీ చేపట్టనున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
భూపాలపల్లి అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్–2020 క్రమబద్ధీకరణకు ఫీజు రాయితీతో కూడిన చెల్లింపు గడువును ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీ నివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. 25శాతం రాయితీతో ఫీజు చెల్లింపునకు అ వకాశం ఉందని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలన్నారు.
స్విమ్మింగ్ కోచ్‌కు సన్మానం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్ కోచ్‌గా విధులు నిర్వహించి బెల్లంపల్లి ఏరియాకు బదిలీపై వెళ్తున్న భీముని తిరుపతిని ఏరియా పర్సనల్ విభాగం అధికారులు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా అధికార ప్రతినిధి మారుతి మాట్లాడారు. అధికారుల సుచనలు, సలహాలు పాటిస్తూ తిరుపతి తన విధులు బాధ్యతగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ విభాగం అధికారులు, సిబ్బంది గుండు రాజు, శ్రావణ్‌కుమార్, రవి, చంద్రయ్య, శివ, ప్రణయ్, ప్రతిభ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముగిసిన
టెన్త్ ఒకేషనల్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ఏడు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి ఒకేషనల్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకేషనల్ పరీక్షకు 395మంది విద్యార్థులకు గాను 392మంది హాజరైనట్లు తెలిపారు. దీంతో పరీక్షలు ముగిశాయన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను
ఎండగట్టాలి
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు, ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం లాంటి వైఫల్యాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్‌రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపురి రాజమౌళి గౌడ్‌తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. రైతు వ్యవసాయ కూలీలు, మహిళలు, నిరుద్యోగ, యువత ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసి ఒత్తిడి తీసుకువచ్చేలా ఆయా అంశాలపై ఆందోళనలకు సిద్ధం కావాలని తీర్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చదువు రామచంద్రారెడ్డి, కన్నం యుగదీశ్వర్, నాయకులు మొగిలి, మోరే రవీందర్ రెడ్డి, దొంగల రాజేందర్, వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
షెడ్ల నిర్మాణ పనులకు మార్కింగ్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని వనదేవతల సన్నిధిలో గల క్యూలైన్లపై జీఐ షీట్ల షెడ్ల నిర్మాణం పనులకు గురువారం మార్కింగ్ చేశారు. జీఐ షీట్ల షెడ్ల నిర్మాణానికి రూ.3కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.
నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన
నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన


