ఉపాధి లక్ష్యంగా..
కాటారం ఐటీఐకి అనుసంధానంగా ఏటీసీ
పెరుగుతున్న ఆదరణ..
ప్రస్తుతం ఐటీఐ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. భూపాలపల్లి, కాటారం ఐటీఐ కళాశాలల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కోపా, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ విభాగాలు కొనసాగుతున్నాయి. ఆయా విభాగాల్లో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ విభాగాాల్లో 20 చొప్పున సీట్లు, కోపా, సివిల్ డ్రాఫ్ట్‌మెన్‌లో 24 చొప్పున సీట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.
● అధునాతన, సాంకేతికతపై శిక్షణ
● పూర్తికావస్తున్న
ఏటీసీ శిక్షణ భవనాలు
● వచ్చే విద్యాసంవత్సరం
నుంచి ప్రవేశాలు
● ఆరు కోర్సుల్లో 172 సీట్లు
కాటారం: యువతకు అధునాతన, సాంకేతిక విద్యను అందించి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థ(ఐటీఐ)లను నవీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు(ఏటీసీ)గా తీర్చిదిద్దుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కాటారం సబ్ డివిజన్ కేంద్రంలోని ఐటీఐ కళాశాలకు అనుసంధానంగా ఏటీసీ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అధునాతన, సాంకేతికతపై శిక్షణకు ఆయా ఏటీసీ కేంద్రాల్లో వచ్చే విద్యాసంవత్సరం(జూన్ 2025) నుంచి పూర్తి స్థాయిలో తరగతుల ప్రారంభానికి చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఏటీసీలో ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కాగా ల్యాబ్ భవనం పూర్తికాక థియరీ క్లాస్‌లు మాత్రమే సాగుతున్నాయి. కాటారం ఏటీసీ కేంద్రంలో ల్యాబ్ భవనం పూర్తికావస్తుండటంతో ఈ ఏడాది నుంచి థియరీ, ప్రాక్టికల్ తరగతులు జరగనున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం, శిక్షణ పూర్తయిన వారికి స్వయం ఉపాధి కల్పించేలా పనిచేస్తాయి. భూపాలపల్లి, కాటారంలో రూ.4.76 కోట్లతో ఏటీసీ భవన నిర్మాణాలు చేపట్టగా చివరి దశలో ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఆరు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది, రెండేళ్ల కోర్సులకు సంబంధించి 172 సీట్లు భర్తీ చేస్తారు. ఇప్పటికే ఏటీసీలకు 70 శాతం ప్రయోగ పరికరాలు(యంత్రాలు) చేరగా బిగించారు. కోర్సులకు సంబంధించి ఏటీసీ భవనంలో డెల్‌వర్క్ స్టేషన్, ఐవోటీ కిట్, సర్వర్ రాక్, త్రీడీ ప్రింటర్, కార్ లిఫ్ట్, సిల్, ఫెయింట్ బాత్, ఇండస్ట్రీయల్ రోబోటెక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్(సీఎన్‌సీ), వీఎంసీ, ప్లంబింగ్ పరికరాలు బిగించారు. మరికొన్ని పరికరాలు రావాల్సి ఉంది.
కొత్త కోర్సులు ఇవే..
కోర్సులు సీట్లు కాలవ్యవధి
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్
కంట్రోల్ అండ్ అటోమేషిన్ 40 ఏడాది
ఇండ్రస్టియల్ అండ్ అటోమేషిన్ 40 ఏడాది
ఇండస్ట్రియల్ రోబోటెక్స్,
డిజిట్ మ్యానుఫ్యాక్చరింగ్ 20 ఏడాది
ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్ 24 రెండేళ్లు
బేసిక్‌డిజైనర్, వర్చువల్ వెరిఫయిర్ 24 రెండేళ్లు
మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ 24 రెండేళ్లు
యువతకు స్వయం ఉపాధి పెంపొందించే దిశగా ఏటీసీలు దోహదపడుతాయి. భూపాలపల్లి ఏటీసీలో ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్నాయి. కాటారంలో ఏటీసీ భవన నిర్మాణం పూర్తికావచ్చింది. త్వరలోనే యంత్రాల బిగింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తాం. ఏటీసీ కోర్సుల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తాం.
– భిక్షపతి, ప్రిన్సిపాల్, ఐటీఐ, కాటారం
ఉపాధి లక్ష్యంగా..


