జగ్జీవన్‌రామ్ ఆశయాలు కొనసాగించాలి
భూపాలపల్లి అర్బన్: డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిట్ట చివరి పేద కుటుంబం వరకు సంక్షేమ పథకాలు చేరేవిధంగా అధికారులు పని చేసినప్పుడే మహనీయుల ఆశయాలను సాధించిన వారమవుతామని తెలిపారు. విద్యనభ్యసించడం వల్ల ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు వస్తుందనడానికి జగ్జీవన్ రామ్ జీవితం నిదర్శనమని అన్నారు. అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవతో మన్ననలు పొందారని కొనియాడారు. నేటితరం యువతకు ఆయనను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. ఆయన ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిదన్నారు. ఆయన సేవలు ప్రతి ఒక్క భారతీయుడికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, డీఆర్డీఓ నరేష్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఇన్‌చార్జ్ డీఈఓ రాజేందర్, డీఎస్పీ సంపత్ రావు, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో..
భూపాలపల్లి రూరల్: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడా రు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని తెలిపారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జగ్జీవన్‌రామ్ ఆశయాలు కొనసాగించాలి


