భవిత.. భరోసా
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
భవిత కేంద్రాలు12
● దివ్యాంగ విద్యార్థులకు ఎనిమిది నెలల భత్యం విడుదల
● 329 మందికి రూ.8.92 లక్షల నిధులు
● నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ
● హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
విద్యార్థుల సంఖ్య
329
కాటారం: దివ్యాంగ విద్యార్థులకు విద్యాపరంగా, ఇతర అంశాలపై భవితా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కల్పించడంతోపాటు కేంద్రాల వద్దకు రాలేని వారికి ఇంటి వద్దనే తర్పీదు ఇచ్చి వారిలో క్రమంగా మార్పులు తీసుకురావడం కోసం గతంలో ప్రభుత్వాలు విలీన విద్యకు శ్రీకారం చుట్టాయి. మానసిక, శారీరక వైకల్యం కల్గిన బాల బాలికలకు వివిధ పద్ధతుల్లో విద్య అందించడానికి ప్రభుత్వం గతంలో విలీన విద్యా వనరుల కేంద్రాలు(ఐఈఆర్‌సీ) ఏర్పాటు చేసింది. వీటినే భవిత కేంద్రాలుగా పిలుస్తుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడి, దివ్యాంగులైన తమ చిన్నారులను శిక్షణకు తీసుకురాలేని కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలనెలా రవాణా, ఎస్కార్ట్, స్టైఫండ్, రీడింగ్ అలవెన్స్ రూపంలో భత్యం అందజేస్తూ ప్రోత్సాహిస్తున్నాయి. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర శిక్షా తెలంగాణ, పీఎంశ్రీ ఆధ్వర్యంలో సమకూరుస్తున్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎనిమిది నెలల భత్యం రూ.8.92 లక్షలు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.
జిల్లాలో 12 భవిత కేంద్రాలు..
జిల్లాలో మొత్తం 12 భవిత కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కాటారం, భూపాలపల్లి, చిట్యాల కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా మిగిలిన 9 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోని ఒక గదిలో భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఐఈఆర్‌పీ (ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) లు సమ్మేళన విద్యావిధానంతో ఈ చిన్నారులకు శిక్షణ ఇచ్చి సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దుతుంటారు. భవిత కేంద్రాలకు రాలేని మానసిక వైకల్యంగల వారికి ఇంటి వద్దకే వెళ్లి నైపుణ్యాలు నేర్పిస్తుంటారు. జిల్లాలో 329 మంది దివ్యాంగులైన బాలబాలికలు భవితా కేంద్రాల్లో శిక్షణ పొందుతుండగా 19 మంది ఐఈఆర్‌పీలు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో సుమారు 65 మంది ఇంటి వద్ద నేర్చుకునే విద్యార్థులకు ప్రతి శనివారం ఒక్కో ఐఈఆర్‌పీలు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి బోధిస్తుంటారు.
వివిధ కేటగిరీల కింద..
● భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగ పిల్లలకు నెలకు రూ.500 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పది నెలల రవాణా భత్యం అందిస్తున్నాయి. 1 నుంచి 12 తరగతి వరకు అభ్యసించే వారికి ఏటా రూ.5వేల చొప్పున చెల్లిస్తాయి.
● అంధత్వం, అంగవైకల్యం కలిగి పాఠశాలలకు వచ్చి చదివే వారికి నెలకు రూ.550 చొప్పున పది నెలలకు రూ.5,500 అందజేస్తారు. ఈ విద్యార్థులను కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకొని వస్తుండటంతో ఎస్కార్ట్ భత్యంగా కాస్త ఎక్కువ అందిస్తారు.
● పాఠశాలలు, భవిత కేంద్రాలు, ఇంటి వద్ద విద్య పొందే బాలికలకు స్టైఫండ్ కింద నెలకు రూ.200 చొప్పున పది నెలలకు రూ.2వేలు అదనంగా చెల్లిస్తారు.
● అంధులు, అల్పదృష్టి కల్గిన పిల్లలకు రీడింగ్ అలవెన్స్ పేరుతో నెలకు రూ.60 చొప్పున పది నెలలకు రూ.600 అదనంగా చెల్లిస్తుంటారు.
విద్యార్థుల ఖాతాల్లో నేరుగా..
పాఠశాలలు, భవిత కేంద్రాలు, ఇంటి వద్ద శిక్షణ పొందుతున్న మానసిక, శారీరక వైకల్యం కల్గిన పిల్లలకు ప్రభుత్వం ప్రతి ఏడాదీ రవాణా, ఎస్కార్ట్, స్టైఫండ్, రీడింగ్ అలవెన్స్‌లను అందిస్తుంది. ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులైన విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా డబ్బులు జమ చేస్తుంది. ఇప్పటికే జిల్లాలో అందరి ఖాతాల్లో జమ అయ్యాయి.
– రమేశ్, విలీన విద్య జిల్లా కోఆర్డినేటర్
పీఎంశ్రీ నిధులు49,800
సమగ్ర శిక్షా నిధులు
8,42,380
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
న్యూస్‌రీల్
భవిత.. భరోసా
భవిత.. భరోసా
భవిత.. భరోసా
భవిత.. భరోసా
భవిత.. భరోసా


