అటకెక్కిన డేంజర్ జోన్
మల్హర్: తమ ప్రాంతంలో అపార బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు అవసరం అయిన ఇళ్ల స్థలాలను సైతం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాసితులను జెన్‌కో మాత్రం తన తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. తాడిచర్లలో బొగ్గు తవ్వకాల కోసం అన్వేషణ ప్రారంభించినప్పటి నుంచి తమకు దక్కాల్సిన వాటికోసం ఈ ప్రాంతవాసులు ఎన్నోమార్లు రాజీలేని పోరాటాలు చేపట్టారు. ప్రతీ సందర్భంలోనూ కంపెనీ తనకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తూనే నిర్వాసితుల సమస్యలను మాత్రం పెడచెవిన పెడుతూనే ఉంది. బొగ్గు వెలికితీత ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ ఈ ప్రాంతవాసులకు డేంజర్ జోన్ ఇళ్ల సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు.
బ్లాస్టింగ్‌లతో భయాందోళన
బొగ్గు వెలికితీత కోసం పెడుతున్న బాంబులు ఇళ్లలో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ బాంబులతో గిన్నెలు, బోళ్లు కూడా కింద పడుతున్నాయి. అసలు ఇంట్లో ఉండాలంటేనే భయం.. భయంగా బతికే పరిస్థితి నెలకొంది. ఇది మండల పరిధిలోని పెద్దతాడిచర్ల ఉపరితల బొగ్గు గనికి కూతవేటు దూరంలో నివసించే కాలనీ వాసుల ఆవేదన. తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో జరుగుతున్న బ్లాస్టింగ్‌లతో రోజురోజుకూ ప్రజల్లో భయాందోళన పెరుగుతుంది. ఓసీపీ ప్రాజెక్టు 500 మీటర్ల పరిధిలో ఇళ్లు ఉండడంతో పాటు స్థాయికి మించి బ్లాస్టింగ్ చేయడం ద్వారా తమ ఇళ్ల కప్పులు పగులుతున్నాయని, గోడలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో ఉండాలంటేనే జంకుతున్నామని చెప్పారు. పనులతో వచ్చే దుమ్ము, ధూ ళి ఇళ్లపై చేరడంతో పాటు, తినే ఆహార పదార్థాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోగాల బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు.
సీఎండీ రాకతో..
మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ మైన్‌లో జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానీయ ఈనెల 1వ తేదీన పర్యటించారు. ఈ నేపథ్యంలో మండలంలోని పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ ఇళ్ల సమస్యను పరిష్కస్తామని నిర్వాసితులు ఆందోళన చెందవద్దని హమీఇచ్చారు. సీఎండీ ప్రకటనతో నిర్వాసితుల్లో డేంజర్ జోన్‌పై ఆశలు చిగురించాయి. డేంజర్ జోన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొంతమంది ఇప్పటికే హైకోర్టు మెట్లు ఎక్కినట్లు తెలిసింది.
సేకరణ పనులు ప్రారంభించాలి
మండలంలో పెద్ద తాడిచర్ల ఇళ్ల సేకరణ పనులు ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. ఓపెన్‌కాస్ట్ బ్లాసింగ్‌లతో తాము ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి నాయ్యం చేయాలి.
– మంతెన సమ్మయ్య, పెద్ద తాడిచర్ల, మల్హర్
జెన్‌కో తీరుతో భూ నిర్వాసితులకు ఇబ్బందులు
బ్లాస్టింగ్‌లతో భయాందోళన
సీఎండీ రాకతో చిగురించిన ఆశలు
పీఎన్ ప్రకటనకే పరిమితం
డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్ల సేకరణకు 2022 డిసెంబర్ 14న 359.23 ఎకరాలకు 2600 చిలుకు ఇళ్లకు పీఎన్ (ప్రాథమిక నోటిఫికేషన్)ను ప్రతికల్లో ప్రచురించారు. కానీ డిక్లరేషన్ ప్రకటించకపోవడంతో 2024 డిసెంబర్‌లో సదరు నోటిఫికేషన్ రద్దయింది. దీంతో డేంజర్ జోన్ సమస్య మొదటికి వ చ్చింది. నోటిఫికేషన్ వేసి ఇళ్లు సేకరించి తమకు న్యాయం చేయాలని మండలానికి వచ్చిన జిల్లా అ ధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.
అటకెక్కిన డేంజర్ జోన్
అటకెక్కిన డేంజర్ జోన్


