కల్యాణాన్ని వీక్షించిన మంత్రి
కాటారం: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వగ్రామం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల విందుగా సాగింది. కల్యాణాన్ని మంత్రి శ్రీధర్‌బాబు వీక్షించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తల్లి జయమ్మ, సోదరుడు శ్రీనుబాబు దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అంతకముందు శ్రీనుబాబు దంపతులు శ్రీసీతారాముల సహిత లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను. పట్టు వస్త్రాలను మంత్రి ఇంటి నుంచి ఆలయం వరకు తీసుకొచ్చారు. కాటారం మండల కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంతో పాటు, గారెపల్లి ఆంజనేయస్వామి ఆలయం, ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో కల్యాణం ఘనంగా నిర్వహించారు.


