పరిష్కారమెప్పుడో..?
భూపాలపల్లి అర్బన్: ప్రజావాణిలో సమస్యలకు పరిష్కారం లభించడంలేదని ప్రజలు వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా నుంచి మొత్తం 48 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ ఆశోక్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి కలిసి ఆర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు నిర్ధిష్ట సమయంలో స్పందించాలని సూచించారు. ప్రజలు అధికారులను నేరుగా కలిసే వేదిక ప్రజావాణి అని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు.
పింఛన్‌ను పునరుద్ధరించడం లేదు..
ఆరు సంవత్సరాలుగా బోదకాలుతో బాధపడుతుండగా పింఛన్ అమలు చేశారు. ఎనిమిది నెలల క్రితం పింఛన్ ఆగిపోయింది. నాటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పింఛన్ రావడం లేదు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరిగిన సదరం క్యాంపునకు వెళ్లగా పైలేరియా అని గుర్తించారు. పింఛన్ కోసం తిరిగితిరిగి అలసిపోతున్నాం. కలెక్టర్ స్పందించి పింఛన్ ఇప్పించాలి.
– కామారపు నాగబూషణం, ఇస్సిపేట
ఆధార్ సెంటర్ ఏర్పాటుకు
అవకాశం కల్పించాలి..
దివ్యాంగుడినైనా నాకు జీవనోపాధి కోసం కలెక్టర్ స్పందించి ఆధార్ సెంటర్, మీసేవా కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించాలి. 2019 సంవత్సరం నుంచి జీవనోపాధి కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం గ్రామంలోనే సీఎస్సీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. ఆధార్ ఆపరేటర్ సూపర్‌వైజర్ ట్రైనింగ్ పూర్తిచేశాను. గ్రామాల్లో ఆధార్ సెంటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాకు ఆధార్ సెంటర్ కేటాయించినట్లయితే గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తాను.
– సంగీ శంకర్, దుబ్యాల, టేకుమట్ల
ఉపాధి కల్పిస్తామని
పట్టించుకోవడం లేదు..
జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ స్థలంలో 141 సర్వే నంబర్‌లో మా తండ్రి పేరున ఉన్నటువంటి ఐదున్నర గుంటల భూ మిని కోల్పోయాం. అప్పటి కలెక్టర్ భవేష్‌మిశ్రా నష్టపోయిన భూమికి బదులుగా ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలి.
– కామారపు రవికుమార్, ఇస్సిపేట
ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ
వివిధ సమస్యలపై
48 ఆర్జీలు..
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ రాహుల్‌శర్మ
పరిష్కారమెప్పుడో..?
పరిష్కారమెప్పుడో..?
పరిష్కారమెప్పుడో..?


