పెయింటింగ్ డబ్బులు ఇవ్వలేదు..
గతేడాది ఆగస్ట్ మాసంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం రేపాక, చిట్యాల మండలం జూకల్లు గ్రామాల్లోని అంగన్‌వాడీ సెంటర్‌లను మోడల్ అంగన్‌వాడీలుగా మార్చే క్రమంలో పెయింటింగ్ వేశాం. రూ.1.10లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు సంబంధిత శాఖ అధికారులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అప్పులు చేసి పెయింటింగ్ డబ్బాలు, ఇతర మెటీరియల్ తీసుకువచ్చి వేశాం. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చిట్యాల మండలం ముచినీపర్తి, ఏలేటిరామయ్యపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే పెయింటింగ్స్ వేశాం. దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. – సుదమల్ల రమేశ్, ఆర్టిస్ట్, రేపాక, రేగొండ


