చెట్టును ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
కాటారం: గాలివానకు ప్రధాన రహదారిపై నేలకు ఒరిగిన చెట్టును గమనించక ఢీ కొట్టిన ద్విచక్రవాహనదారుడు తీవ్ర గాయాలపాలైన ఘటన మంగళవారం రాత్రి కాటారం మండలంలో చోటుచేసుకుంది. బొప్పారం గ్రామానికి చెందిన మంతెన పూర్ణచందర్ తన ద్విచక్ర వాహనంపై బొప్పారం నుంచి మండల కేంద్రానికి వస్తున్నాడు. గాలివానకు ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయి ఉంది. పూర్ణచందర్ చీకట్లో చెట్టును గమనించక బైక్‌తో చెట్టును బలంగా ఢీ కొట్టాడు. పూర్ణచందర్ తలతో పాటు తీవ్రగాయాలయ్యాయి. అటు వైపుగా వెళ్లిన వారు 108కి సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


