‘టెన్త్’ మూల్యాంకనంలో నిర్లక్ష్యం..
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాజీపేట ఫాతిమా హైస్కూల్‌లో శ్రీటెన్త్‌శ్రీ మూల్యాంకనం కొనసాగుతోంది. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు అసిస్టెంట్ ఎగ్జామినర్లు( ఏఈ)గా మూల్యాంకనంలో భాగంగా మార్కులు పోస్టింగ్ చేయడంలో పొరపాట్లు చేస్తున్నారు. స్క్రూటినీలో ఆయా పొరపాట్లు గుర్తించి సక్రమంగా మూల్యాంకనం చేయాలని చీఫ్ ఎగ్జామినర్, ఇతర సిబ్బంది సూచించినా అలాగే నిర్లక్ష్యం చేస్తుండడంతో వారిని విధుల నుంచి టెన్త్ స్పాట్ క్యాంపు ఆఫీసర్, డీఈఓ వాసంతి రిలీవ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మ్యాథ్‌స్కూల్ అసిస్టెంట్‌కు మూల్యాంకనం విధులు అప్పగించగా మంగళవారం నిర్లక్ష్యం వహించారు. విద్యార్థుల జవాబుపత్రాల్లో మార్కుల పోస్టింగ్‌లో పొరపాట్లు చేస్తున్నట్లు స్క్రూటినీలో గుర్తించారు. సక్రమంగా చేయాలని సూచించినా బుధవారం కూడా అదేమాదిరి చేయడంతో అతడు చేసిన జవాబుపత్రాలను క్యాంప్ ఆఫీసర్‌కు వాసంతికి చూపించారు. దీంతో అతడిని వెంటనే రిలీవ్ చేశారు. అలాగే, జయశంకర్ భూపాలపల్లిజిల్లాలో బయోసైన్స్‌స్కూల్ అసిస్టెంట్ కూడా సోమవారం ఏఈగా మూల్యాంకనం విధుల్లో చేరారు. సరిగా చేయకపోవడంతో గుర్తించి సంబంధిత సీఈ, ఇతర సిబ్బంది చెప్పినా మార్కుల పోస్టింగ్‌లలో పొరపాట్లుచేస్తుండగా రెండురోజులు అలాగే తప్పులు చేస్తుండడంతో పరిశీలించి మంగళవారం రిలీవ్ చేశారు. ఆయా ఇద్దరు స్కూల్‌అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని డీఈఓ వాసంతి గురువారం జయశంకర్ భూపాలపల్లి డీఈఓకు లిఖితపూర్వక సమాచారం పంపనున్నారు. వీలైతే సస్పెండ్ చేయాలనేది ఆదేశించనున్నారనేది చర్చ జరగుతుంది.
ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ల రిలీవ్
చెప్పకుండా క్యాంప్ నుంచి వెళ్లిన మరో టీచర్
చర్యలు తీసుకోవాలని డీఈఓలకు సమాచారం
చెప్పకుండా విధుల నుంచి వెళ్లిన టీచర్
మహబూబాబాద్ జిల్లాలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మంగళవారం ఫాతిమా హైస్కూల్ స్పాట్ క్యాంపు వద్దకు వచ్చారు. తనకు విధులు అప్పగిస్తే అసిస్టెంట్ ఎగ్జామినర్‌గా మూల్యాంకనం చేస్తానని చెప్పగా అక్కడ సంబంధిత అధికారులు అతడికి విదులు అప్పగించారు. పది జవాబుపత్రాలు మూల్యాంకనం చేశాక మంగళవారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా క్యాంపు నుంచి వెళ్లిపోయాడు. దీంతో సంబంధిత సిబ్బంది అతడికి ఫోన్‌చేస్తే స్విచాఫ్ వచ్చింది. బుధవారం కూడా క్యాంప్‌నకు రాలేదు. ఫోన్‌లో సంప్రదించే యత్నం చేసినా అందుబాటులోకి రావడం లేదు. ఈ విషయం డీఈఓ వాసంతికి తెలియజేయగా మహబూబాబాద్ డీఈఓకు కూడా సంబంధిత టీచర్‌పై సమాచారం ఇచ్చారు. అలాగే, అతడిపై చర్యలు తీసుకోవాలని గురువారం లిఖితపూర్వకంగా మహబూబాబాద్ డీఈఓకు పంపనున్నారు. అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


