ప్రయాణంలో ఆహారం ముఖ్యం..
బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో విటమిన్ ’బి’ లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కాయగూరలు, ధాన్యాలు, క్యారెట్ ఎక్కువ తీసుకోవాలి. తరచూ నీరు తాగాలి. తద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. ప్రయాణంలో వాహనం ఆపిన సమయంలో కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. వదులు దుస్తులు ధరించాలి. తద్వారా శరీరానికి గాలి బాగా తగులుతుంది. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణంలో తాగునీరు, పండ్ల రసాలు వెంట తీసుకెళ్లాలి. ఓఆర్‌ఎస్ వెంట తీసుకెళ్లడం మరవద్దు. పిల్లలకు పలుచని దుస్తులు వేయాలి. ముఖానికి లోషన్స్ తప్పనిసరిగా రాసుకోవాలి.


