హుండీ ఆదాయం రూ.1.34 లక్షలు
అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వరస్వామి జాతర సందర్భంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసిన హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. గత నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించగా.. ఆలయ కమిటీ సభ్యులు హుండీ డబ్బును లెక్కించారు. మొత్తం రూ.1,34,650 నగదు ఉన్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు అశోక్, ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు
అందించాలి
గద్వాల వ్యవసాయం: పశువులకు, పెంపుడు జంతువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని 1962 పశుసంవర్ధకశాఖ అంబులెన్స్ సిబ్బందికి 1962 అంబులెన్స్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బగీష్ మిశ్రా సూచించారు. శనివారం ఆయన ఆకస్మికంగా అంబులెన్స్‌ను తనిఖీ చేశారు. వైద్య పరికరాలు, వాటి పనితీరు, మందులను పరిశీలించారు. అంబులెన్స్ ద్వారా పశువులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే స్పందించాలని, జిల్లాలో ప్రతి అంబులెన్స్ 10 ట్రిప్పులతో 20కి పైగా పశువులకు సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రత్నమయ్య, డాక్టర్ అనిత, ప్యారవేట్ దయానంద్, హెల్పర్ మురళీ, కెప్టెన్ తిక్కన్న ఉన్నారు.
జోగుళాంబ సన్నిధిలో వరంగల్ ఎమ్మెల్యే
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ శక్తిపీఠాన్ని వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. అలాగే, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సతీసమేతంగా జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం రూ.1.34 లక్షలు
హుండీ ఆదాయం రూ.1.34 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment