సారా రహిత రాష్ట్రమే ధ్యేయం
ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్‌ను సారా రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ‘నవోదయం 2.0 కార్యక్రమాన్ని రూపొందించిందని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా ప్రత్తిపాడు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. కార్యాలయంలోని రిజిస్టర్లు, రికార్డులను క్షుణంగా పరిశీలించారు. అనంతరం నవోదయం 2.0పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని ఎకై ్సజ్ నేరాలు, సారా తయారీ, రవాణా, క్రయవిక్రయాలపై సమీక్షించారు. సారాను పూర్తిగా నిషేదించేందుకు కృషిచేయాలని ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలను ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక, ఎకై ్సజ్ సూపరిటెండెంట్ కృష్ణకుమారి, అసిస్టెంట్ ఎక్‌పైజ్ సూపరిటెండెంట్ జయమౌనిక పాల్గొన్నారు.


