 
															అన్ని రంగాల్లో పురోగమించాలి
● కలెక్టర్ షణ్మోహన్
● ఘనంగా ఉగాది వేడుకలు
కాకినాడ సిటీ: విశ్వావసు నామ నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కాకినాడ సూర్యకళా మందిరం ఆడిటోరియంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ షణ్మోహన్, విశిష్ట అతిథులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందుమాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. సన్నాయి విద్యాంసులు ఎన్.సత్తిబాబు, పసుపులేటి లోవ చిట్టిబాబు బృందం నాదస్వర ఆలాపన అనంతరం వేద పండితులు కె.సూర్యశర్మ అవధాని, కె.చంద్రశేఖరశాస్త్రి, బి వరప్రసాద్ శర్మ, కె ఆంజనేయశాస్త్రి, పి శ్రీనివాసశర్మ ఆహుతులకు మహదాశీర్వచనం పలికారు. పంచాంగకర్త సరిపెల్ల వేంకట శ్రీరామచంద్రమూర్తి ఉగాది పంచాంగ పఠనం నిర్వహించి విశ్వావసు సంవత్సరంలో నవ నాయక ఫలాలు, రాశి ఫలాలు, దేశ కాలమాన పరిస్థితులు, వర్షాలు, పాడిపంటల భవిష్య సూచనలు వివరించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో వైష్ణవి ఆరభి కూచిపూడి నృత్యం, మల్లికార్జున బృందం భరత నాట్యం, ఎస్ అజయ్, టి ఆనంద్ బృందం సంగీత విభావరి, ప్లూట్ కళాకారుడు చందు వేణుగా రవళి సభికలను అలరించాయి. ఉగాది కమి సమ్మేళనంలో కోరుప్రోలు గౌరినాయుడు సంధానకర్తగా కవులు గరికపాటి సూర్యనారాయణమూర్తి, పసుమర్తి పద్మజావాణి, వేదుల శ్రీరామశర్మ, మార్ని జానకిరామయ్యచౌదరి, ఎన్‌వీవీ సత్యనారాయ; మాకినీడి సూర్యభాస్కర్, పొత్తూరి సీతారామరాజు, పి విజయరత్నం, పినపోతు వేంకటేశ్వరరావు, కె చినఅప్పరాజు కవితాగానం చేసి సభికులను రంజింప చేశారు. ఉగాది వేడుకలో భాగంగా జిల్లా సాంస్కృతిక మండలి తరపున పండితులు కవులు, కళాకారులను కలెక్టర్ షణ్మోహన్, అతిథులు సత్కరించారు.
దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చక పండితులు చక్రవర్తుల అనంతాచార్యులు, కల్లేపల్లి భీమశంకరప్రసాద్, పూజ్యం నాగేశ్వరరావు, సురవరపు వీరవెంకట నాగ జోగ సూర్యశంకర శ్రీనివాస్‌ను సత్కరించారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ విశ్వావసు సంవత్సరంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లా శాంతి సౌఖ్యాలతో విలసిల్లాలని ఎస్పీ బిందుమాధవ్ కాంక్షించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్‌బాబు, సమాచార పౌరసంబంధాల శాఖ డీడీ డి.నాగార్జున, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, రాష్ట్ర రెడ్‌క్రాస్ చైర్మన్ వైడీ రామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కె కృష్ణమూర్తి, కరక రాజబాబు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
