ముగిసిన అగ్నిమాపక
వారోత్సవాలు
కాకినాడ క్రైం: జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. స్థానిక రామారావుపేటలోని ఇండియన్ రెడ్‌క్రాస్ భవంతిలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అగ్ని మాపక సహాయ అధికారి ఉద్దండురావు సుబ్బా రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కాకినాడ బ్రాంచ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు వైడీ రామారావు, ఎన్.సుగుణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సుగుణారెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం వల్ల అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు నష్టం ఎక్కువగా ఉంటోందని అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆ శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహించిన ప్రదర్శనలు, విన్యాసాలు ప్రజల్లో విశేష అవగాహన పెంపొందడానికి దోహదపడ్డాయని చెప్పారు. రెడ్‌క్రాస్ సభ్యులు శివకుమార్, ఉషారాణి మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ శాఖ అందిస్తున్న విపత్తు నిర్వహణ సేవలను కొనియాడారు. ఏడీఎఫ్‌వో ఉద్దండురావు సుబ్బారావు మాట్లాడుతూ, వారోత్సవాల సందర్భంగా తాము నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని అన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి పీవీ సాయిరాజేష్ పర్యవేక్షణలో వారోత్సవాలు నిర్వహించామని చెప్పారు. అనంతరం రెడ్‌క్రాస్ ఆవరణలో అనుకోని ప్రమాదాల్లో ఒక్కసారిగా మంటలు రేగితే నియంత్రించే శాసీ్త్రయ విధానాలను ప్రదర్శన ద్వారా వివరించారు.


