
ఖలీల్‌వాడి (నిజా మాబాద్ అర్బన్): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో విధులు నిర్వహి స్తున్న సీసీఆర్‌బీ ఎస్సై దయానంద్‌రావు(57) శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు.
ఆయన శనివారం రాత్రి తన స్వస్థలమైన నిర్మల్‌కు వెళ్లారు. అక్కడ రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు. దయానంద్‌రావు 1983లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. 2018లో ఎస్సైగా ప్రమోషన్ పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆదివారం నిర్వహించిన అంత్యక్రియలలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ జయ్‌రామ్ గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment