బీబీపేట: పాఠశాల బాల్యం జీవితంలో ఎప్పటికీ తిరిగిరానిదని డీఈవో రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని జనగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ పాత రాజు, హెచ్‌ఎం ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ రవిందర్‌రెడ్డి, దోమకొండ ఎంఈవో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వయంపాలన దినోత్సవం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మేజర్‌వాడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటివిద్యార్థులకు పాఠాలను బోధించారు. అనంతరం పాఠశాలలోని ఆరో తరగతి విద్యార్థులు ఏడో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీలత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనుల పరిశీలన
బీబీపేట: మండల కేంద్రంలోని పారిశుధ్య పనులను శుక్రవారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. రేషన్ షాపు వద్దకి వెళ్లి సన్నబియ్యం పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎల్‌ఆర్‌ఎస్ గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు దారులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో అబ్బాగౌడ్, కారోబార్ సిద్దరాములు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
బాల్యం ఎప్పటికీ తిరిగిరానిది
బాల్యం ఎప్పటికీ తిరిగిరానిది


