రాముడి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎదిగా
రామారెడ్డి/తాడ్వాయి/గాంధారి(ఎల్లారెడ్డి): రామారెడ్డిలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఇక్కడే పెరిగానని కాలభైరవుడి, సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. రామారెడ్డి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. తాడ్వాయి శ్రీశబరిమాత ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమం, ఎర్రాపహాడ్‌లోని శ్రీరాజరాజేశ్వరాలయం, కన్‌కల్‌లోని రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలలో ఏమైనా సమస్యలను దృష్టికి తీసుకువస్తే పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. గాంధారి మండలం రాంలక్ష్మణ్ పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు, కాంగ్రెస్‌నాయకులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
శ్రీరామ నవమి సందర్భంగా
పలు చోట్ల ప్రత్యేక పూజలు
రాముడి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎదిగా


