హన్మాజీపేట్‌లో హనుమాన్ విగ్రహం ధ్వంసం
బాన్సువాడ రూరల్: మండలంలోని హన్మాజీపేట్ గ్రామ శివారులోని పురాతన హనుమాన్ విగ్రహాన్ని శనివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గుర్తించిన గ్రామస్తులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మండల అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీంతో పాటు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. సుమారు 4గంటల పాటు గ్రామంలోనే ఉండి విచారణ చేపట్టారు. దుండగులు గుప్తనిధుల కోసం విగ్రహాన్ని ధ్వంసం చేశారా లేదంటే మరో దురుద్దేశంతో చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలని హనుమాన్ మాలాధారులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.


