హెచ్‌సీయూపై మాట్లాడడం విడ్డూరం
ఆర్మూర్‌టౌన్: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో విలువైన 20వేల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పిందని పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. అలాంటివారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి సంబంధం లేని భూములపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయ న ఆర్మూర్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలు జరిపి సముచిత నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని గుట్టకు తీసుకొస్తానని తెలిపారు. సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
వేలాది ఎకరాల భూములను
బీఆర్‌ఎస్ ధారాదత్తం చేసింది
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్


