కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి
మద్నూర్/బిచ్కుంద/నిజాంసాగర్ (జుక్కల్): రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. డోంగ్లీ మండల కేంద్రంలో, మాగి గ్రామంలో. బిచ్కుందలో సోమవారం వరి, పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. డోంగ్లీ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. డోంగ్లీ మండలంలోని సిర్‌పూర్‌లో ఎమ్మెల్యే సన్న బియ్యం లబ్ధిదారు నామేవార్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆయనతో పాటు సబ్‌కలెక్టర్ కిరణ్మయి, అధికారులు కూడా భోజనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిచ్కుంద మున్సిపాలిటీతో పాటు 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. బిచ్కుంద అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులు రానున్నాయన్నారు. డోంగ్లీ, బిచ్కుంద మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదం ప్రతి ఇంటికి చేరే విధంగా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
సన్నబియ్యం లబ్ధిదారు
ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే


