‘సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం’
మాచారెడ్డి : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని, ఇది చరిత్రాత్మకమైనదని ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం మాచారెడ్డిలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్ర చేశారు. గ్రామంలో రేష న్ దుకాణం వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమా న్ని చేపట్టారు. అనంతరం దళితుల ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యం సరఫరాలో అవకతవకలు జరగనీయవద్దని, ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించాలని అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, సభ్యుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అనంతరం సొసైటీలో కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ విక్టర్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో గోపిబాబు, జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమ కామారెడ్డి ఇన్‌చార్జి కత్తి వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావ్, మాజీ ఎంపీపీ నర్సింగరావు, నాయ కులు నౌసీలాల్, ఇలియాస్, ఇంద్రకరణ్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, రాజమౌళి గుప్తా తదితరులు పాల్గొన్నారు.
‘సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం’


