కామారెడ్డి జిల్లా కోర్టులో పాల్గొన్న న్యాయమూర్తులు
బిచ్కుంద: దౌల్తాపూర్‌లో వైద్య సిబ్బంది సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఎనిమిది మంది నుంచి రక్తనమూనాలు సేకరించారు. గ్రామంలో ప్రజలు విష జ్వరాలతోపాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న అంశంపై ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి సర్వే చేసి జ్వరంతో బాధపడుతున్నవారికి మాత్రలు అందించారు. అయితే చికున్ గున్యా లక్షణాలతో బాధపడుతున్నా తమకు వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన వైద్యాధికారులు సోమవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలువురినుంచి రక్త నమూనాలు సేకరించారు. జ్వరం, నొప్పులకు సంబంధించిన మందులు అందించారు. కొందరికి నొప్పులు, జ్వరం ఎక్కువగా ఉండడంతో బిచ్కుంద ఆస్పత్రిని తరలించారు.
కాగా దౌల్తాపూర్‌లో రక్త నమూనాల సేకరణకు వచ్చిన వైద్య సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలతో దురుసుగా వ్యవహరించారు. దీనిపై ప్రజలు నిరసన తెలిపారు. వైద్య సిబ్బంది తీరుపై ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు.
దౌల్తాపూర్‌లో వైద్య శిబిరం ఏర్పాటు
దౌల్తాపూర్‌లో వైద్య శిబిరం ఏర్పాటు


