అక్రమాలకు అడ్డదారి! | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు అడ్డదారి!

Apr 8 2025 7:39 AM | Updated on Apr 8 2025 7:39 AM

అక్రమ

అక్రమాలకు అడ్డదారి!

దర్జాగా తిరుగుతున్నా..

161వ నంబరు జాతీయ రహదారి

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నాందేడ్‌ నుంచి సంగారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు 161వ నంబరు జాతీయ రహదారి మీదుగా వెళ్తాయి. అయితే తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సలాబత్‌పూర్‌ వద్ద ఇరు రాష్ట్రాల చెక్‌పోస్టులు ఉన్నాయి. వీటిని తప్పించుకునేందుకు అడ్డదారులు ఉపయోగించుకుంటున్నారు. చాలా వ రకు వాహనాలు మహారాష్ట్రలోని దెగ్లూర్‌ నుంచి పె ద్ద శక్కర్గ, నాగ్రాల్‌ గ్రామాల మీదుగా మద్నూర్‌ మండల కేంద్రానికి సమీపంలోని 161 వ నంబరు జాతీయ రహదారి బైపాస్‌ మీదుగా హైదరాబాద్‌ వైపు వెళ్తున్నాయి. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలతో పాటు సరైన రవాణా పత్రాలు లేని, అక్రమ స రకులు రవాణా చేసే, నిషేధిత మత్తు పదార్థాలు త రలించే వాహనాలన్నీ ఈ అడ్డదారి మీదుగానే వెళ్తున్నాయి. ఉత్తర భారతం నుంచి మహారాష్ట్ర మీదుగా హైదరాబాద్‌కు వచ్చే సరకు రవాణా వాహనాలు కూడా చెక్‌పోస్ట్‌ను తప్పించుకోవడానికి అడ్డదారుల్లోనే పయనిస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు వాహనాలు వరుస కడుతాయని, రాత్రంతా వాహనాల రాకపోకలు సాగిస్తాయని తెలుస్తోంది.

దెబ్బతింటున్న రోడ్లు

అధిక లోడుతో వెళ్లే వాహనాలతో రోడ్లు దెబ్బతింటున్నాయి. రూ. కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లు కొద్ది కాలానికే పాడవుతున్నాయి. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారిలో వెళ్లే వాహనాలతో ప్రభుత్వాదాయానికి గండి పడుతుండగా, రోడ్లు కూడా దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంజీర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలు కూడా మద్నూర్‌ నుంచి ఇదే అడ్డదారి గుండా మహారాష్ట్రకు తరలుతున్నాయి. అలాగే మరోవైపు ఇసుకను కర్ణాటకకు మద్నూర్‌ నుంచి జుక్కల్‌ మీదుగా తరలిస్తున్నారు. మద్నూర్‌ మండల కేంద్రం నుంచి జుక్కల్‌కు వెళ్లే ఈ రహదారి అటు కర్ణాటకకు, ఇటు మహారాష్ట్రకు వాహనాలు తరలివెళ్లడానికి అనువుగా ఉంది. దీంతో చాలా మంది ఈ దారిని అక్రమ రవాణాకు ఉపయోగించుకుంటున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

జీరో మాల్‌, అధిక లోడు

వాహనాలన్నీ చిన్నరోడ్ల పైనుంచే..

ఎన్‌హెచ్‌ 161పై చెక్‌పోస్టులను

తప్పించుకోవడానికి..

మహారాష్ట్ర నుంచి

తెలంగాణకు సరుకు రవాణా

ప్రభుత్వ ఆదాయానికి గండి

మహారాష్ట్ర నుంచి వచ్చే సరుకుల రవాణా వాహనాలు.. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను తప్పించుకునేందుకు అడ్డదారిలో వెళ్తున్నాయి. ముఖ్యంగా జీరో మాల్‌ తీసుకువెళ్లే వారు, అధిక లోడుతో వెళ్లే వాహనాలు, నిషేధిత మత్తు పదార్థాలతో పాటు మహారాష్ట్ర నుంచి దేశీదార్‌ మద్యం ఈ దారి గుండానే రవాణా చేస్తున్నారు. రవాణా వాహనాలు చాలా వరకు అడ్డదారిలో వెళ్తుండడంతో ప్రభుత్వాల ఆదాయానికీ గండిపడుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

చెక్‌పోస్టులను తప్పించుకునేందుకు సరుకు రవాణా వాహనాలు అడ్డదారిలో దర్జాగా తిరుగుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు ఈ దారి గుండా వెళ్తున్నట్టు తెలుస్తోంది. చెక్‌పోస్టు కు కూతవేటు దూరం నుంచే వాహనాలు దారి మళ్లుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. మహారాష్ట్రకు చెందిన దేశీదారు (మద్యం) ఈ దారి గుండా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా దొరికే మద్యం కన్నా తక్కువ ధరలకు లభిస్తుండడంతో చాలా మంది దేశీదారు తాగడానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

అక్రమాలకు అడ్డదారి!1
1/2

అక్రమాలకు అడ్డదారి!

అక్రమాలకు అడ్డదారి!2
2/2

అక్రమాలకు అడ్డదారి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement