కోలుకుంటున్న కల్తీ కల్లు బాధితులు
బాన్సువాడ : కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురై బాన్సువాడ ఆస్పత్రిలో చేరినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్య సేవలు అందడంతో వారంతా కోలుకుంటున్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి కల్లు డిపో పరిధిలో ఉన్న కల్లు దుకాణాల్లో సోమవారం కల్తీ కల్లు తాగి 60 మంది ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కల్తీ కల్లు సేవించిన అరగంటకు మెడలు వంగిపోవడం, నాలుక దొడ్డుగా మారడం, కళ్లు తేలేయడం వంటి లక్షణాలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాన్సువాడ ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. మెరుగైన వైద్య సేవలు అవసరం అయిన 12 మందిని నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో వైద్యులు అందించిన సేవలతో బాధితులు కోలుకున్నారు. కాగా రోజూ కల్లు తాగుతామని, ఇలా ఎందుకు అయ్యిందో అర్థం కావడం లేదని బాధితులు పేర్కొన్నారు. కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువగా కలపడంతోనే ఆ కల్లు సేవించినవారు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.
23 మందిపై కేసులు
బాన్సువాడ : దుర్కి కల్తీ కల్లు ఘటనలో 23 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. సోమ వారం బాన్సువాడ ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దుర్కి కల్లు డిపోకు సంబంధించిన కల్లు సేవించి 60 మంది అస్వస్థత కు గురయ్యాయరన్నారు. వారినుంచి నార్కొటిక్ బృందం శాంపిల్స్ సేకరించిందని, రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. దుర్కిలో అనుమతి లేకుండా ఉడతల సురేందర్‌గౌడ్ అనే వ్యక్తి కల్లు డిపో కొనసాగిస్తున్నారని, ఈ కల్లు డిపో నుంచి అంకోల్, దుర్కి, బీర్కూర్ మండలం దామరంచ గ్రామాలకు కల్లు సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఆయా గ్రామాల్లో 18 టీఎఫ్‌టీ లైసెన్సులు కలిగి ఉన్నారన్నారు. ఆ లైసెన్సు కలిగిన కల్లు దుకాణాలకు దుర్కి కల్లు డిపో నుంచి కల్లు సరఫరా చేస్తున్నారన్నారు. 18 టీఎఫ్‌టీ లైసెన్సులను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. దుర్కిలో అనుమతి లేకుండా డిపో కొనసాగిస్తు న్న సురేందర్‌గౌడ్, ఆయన తండ్రి లక్ష్మాగౌడ్, మేనల్లుడు ఆకాష్‌గౌడ్‌లతో పాటు మరో 20 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ హన్మంత్‌రావు పూర్తి వివరాలు సేకరిస్తారని, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు
నస్రుల్లాబాద్: ఆరోగ్య శాఖ సిబ్బంది మంగళ వారం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, దామరంచ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఆయా గ్రామాలకు చెందిన పలువురు సోమవా రం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయిన విష యం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ.. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తోంది. వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని వారు తెలిపారు. మంగళవా రం ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని అంకోల్ సబ్‌సెంటర్ ఎంఎల్‌హెచ్‌పీ మనీష తెలిపారు. సోమవారం అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరినవారి పరిస్థితి నిలకడగా ఉందని, కొందరు డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో ఏఎన్‌ఎంలు స్రవంతి, వెంకటలక్ష్మి, శ్రావణి, ఉమ, ఆశా కార్యకర్తలు శిరీష తదితరు లు పాల్గొన్నారు.
కోలుకుంటున్న కల్తీ కల్లు బాధితులు


