కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన
భిక్కనూరు: విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునివర్సీటీ సౌత్‌క్యాంపస్‌లో కాంట్రాక్టు అధ్యాపకులు మంగళవారం విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.జీవో 21 తీసుకవచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల పొట్ట కొట్టడం ఎంత వరకు సమంజసమని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కో–ఆర్డినేషన్ కమిటి సభ్యుడు డాక్టర్ ఎస్.నారాయణ అన్నారు. సౌత్ క్యాంపస్ భవనం ముందర ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు డాక్టర్ యాలాద్రి, సునీత, రమాదేవి, నర్సయ్య, సరిత, నిరంజన్‌శర్మ, శ్రీకాంత్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


