మత్తు పదార్థాలపై నిఘాలో నిర్లక్ష్యమేల?
బాన్సువాడ : నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో కల్తీ కల్లు 90 మంది ప్రాణాలపైకి తెచ్చింది.గ్రామానికి చెందిన సురేందర్‌గౌడ్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా కల్లు డిపో కొనసాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన సురేందర్‌గౌడ్ అనే వ్యక్తికి హైదరాబాద్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మత్తు పదార్థాలువిక్రయించే వారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సారి మత్తు పదార్థాలు ఒకే చోట నుంచి తీసుకొచ్చేవాడని తెలిసింది. ఈ మధ్య తక్కువ ధరకు మత్తు పదార్థాలులభిస్తున్నాయని ఆశపడి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు తెలిసింది. సురేందర్‌గౌడ్ తన కల్లు డిపోలో ఇటీవల తక్కువ ధరకు కొనుగోలు చేసిన మత్తు పదార్థాలను కల్లులో కలిపి టీఎఫ్‌టీ లైసెన్సులు కలిగిన కల్లు దుకాణాలకు కల్లు సరఫరా చేశాడు. మత్తు మందు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో పాటు మోతాదుకు మించి మత్తు మందును కల్లులో కలిపారు. దీంతో ఆ డిపో పరిధిలో ఏఏ దుకాణాలకు కల్లు సరఫరా చేశారో ఆయా గ్రామాల్లో కల్తీ కల్లు సేవించిన వారందరూ ఆస్పత్రి పాలయ్యారు. సురేందర్‌గౌడ్ గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన సమీప బంధువైన మరొక వ్యక్తికి ఇదే మందు ఇచ్చాడు. సదరు వ్యక్తి కల్లులో దుర్కి కల్లు డిపోలో కలిపిన తక్కువ ధరకు తెచ్చిన మత్తు మందు కలిపాడు. చుట్టూ పక్కల ప్రజలు గౌరారంలో జాతరకు వచ్చి ఈకల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు సేవించిన బాధితులు బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేందర్‌గౌడ్ అనే వ్యక్తి మత్తు మందు ఎక్కడ కొనుగోలు చేశాడనే కోణంలో ఆబ్కారీ శాఖ విచారణ చేపట్టింది. స్థానిక అబ్కారీశాఖ అధికారులు ఏంతెలియదన్నట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దుర్కి కల్లు డిపోలో కలిపిన
మతు ్త మందే గౌరారం గ్రామానికి..


