మెరుగైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలు అందించాలి

Apr 11 2025 1:29 AM | Updated on Apr 11 2025 1:29 AM

మెరుగ

మెరుగైన సేవలు అందించాలి

అభివృద్ధి పనుల పరిశీలన

కామారెడ్డి క్రైం: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ల రైటర్లకు నూతన చట్టాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహనా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్‌ మొదలుకొని చార్జిషీట్‌ దాఖలు, సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడం తదితర అన్ని రకాల కోర్టు వ్యవహారాలను పక్కాగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఫిర్యాదుదారులకు కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బ్లాక్‌ స్పాట్‌ల పరిశీలన

జిల్లాలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న గుర్తించిన బ్లాక్‌ స్పాట్‌లను ఎస్పీ రాజేశ్‌చంద్ర పరిశీలించారు. స్పీడ్‌ గన్‌ల పనితీరును, జరిమానాల గురించి తెలుసుకుని సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీవెంట కామారెడ్డి రూరల్‌, భిక్కనూర్‌, సదాశివనగర్‌ సీఐలు రామన్‌, సంపత్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

కొనసాగుతున్న

వేసవి కాల ప్రత్యేక శిబిరం

దోమకొండ: తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో చేపట్టిన వేసవికాల ప్రత్యేక శిబిరం గురువారం నాలుగో రోజు కొనసాగింది. శిబిరంలో భాగంగా వలంటీర్లు దోమకొండ లోని బస్టాండ్‌ ఆవరణంలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తూ ర్యాలీ తీశారు. గడికోట పడమర ద్వారానికి ఎదురుగా ఉన్న ఉపగడ్డను పరిరక్షించడానికి వలంటీర్స్‌ శ్రమదానం చేయడం చేశారు. గ్రామంలో నైపుణ్యాలపైన సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ చైర్మన్‌ బాబ్జి, ప్రోగ్రాం ఆఫీసర్స్‌ అంజయ్య, డాక్టర్‌ శ్రీ హరిత ,ట్రస్టు కోఆర్డినేటర్‌ నేతుల గణేష్‌ యాదవ్‌, వలంటీర్లు పాల్గొన్నారు.

హాజీపూర్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్‌ తండాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు నిర్వహించారు. క్యాంపులో భాగంగా గ్రామంలోని యువకులకు విద్యార్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌ చంద్రకాంత్‌ తదితరులున్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్‌, లింగంపేట గ్రామాల్లో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ గురువారం పర్యటించారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా ముస్తాపూర్‌ శివారులో చేపడుతున్న చేపల చెరువు పనులతోపాటు లింగంపేట గ్రామంలో అభివృద్ది పనులను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ముస్తాపూర్‌లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు, రేషన్‌ కార్డుల లబ్ధిదారుల సర్వేలో టెక్నికల్‌ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే లింగంపేట నాగన్నగారి మెట్ల బావి పూడికతీత పనులను పరిశీలించిన కలెక్టర్‌.. ఉపాధి హామీలో భాగంగా పనులను చేపట్టాలని ఆదేశించారు. డీఆర్డీవో సురేందర్‌, ఆర్డీవో ప్రభాకర్‌, ఎంపీడీవో నరేశ్‌, ఎంపీవో మల్హారి, ఏపీఎం శ్రీనివాస్‌, తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, కార్యదర్శులు ఉన్నారు.

‘సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీ ఉద్యమం’

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీకి వినతి పత్రం

ఉద్యోగ జేఏసీ అల్టిమేటం

మెరుగైన సేవలు అందించాలి 1
1/2

మెరుగైన సేవలు అందించాలి

మెరుగైన సేవలు అందించాలి 2
2/2

మెరుగైన సేవలు అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement